TG: తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ను ఉరితీయాలని సీఎం రేవంత్ అనడం సరికాదని, ఉద్యమకారుడిని ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందన్నారు. రేవంత్‌ను ఒక్కసారి కాదు.. రెండుసార్లు ఉరితీయాలన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలన్నారు.