KNR: స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీ, వసూళ్లలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మన స్త్రీనిధి’ యాప్ సేవలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సభ్యులు తాము తీసుకున్న రుణం ఎంత? చెల్లించింది ఎంత? అనే వివరాలను గ్రూప్ లీడర్ల అవసరం లేకుండా నేరుగా తమ మొబైల్లోనే చూసుకుని రుణాలు చెల్లించవచ్చు.