TG: మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఒకసారి లక్ష కోట్లు, మరోసారి లక్షన్నర కోట్లు అన్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న సర్కార్.. మూసీ ప్రక్షాళనకు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు తెస్తామంటున్నారు, వాటి టేకింగ్ పాయింట్ ఏంటి? మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తారా? అని అడిగారు.