SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వ తండా సర్పంచ్ అజ్మీర తిరుపతి నాయక్ చెత్త ట్రాక్టర్ నడిపారు. గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ డ్రైవర్‌కు అకస్మాత్తుగా జ్వరం రావడంతో, గ్రామంలో పారిశుద్ధ్య పనులు ఆగిపోకూడదని సర్పంచ్ స్వయంగా స్టీరింగ్ పట్టి వీధివీధినా తిరుగుతూ చెత్తను సేకరించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గ్రామస్థులు సహకరించాలని ఆయన కోరారు.