TG: మూసీ సుందరీకరణకు ఇప్పటివరకు ఎన్ని నివాసాలు కూల్చివేశారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కూల్చివేసిన ఇళ్లకు పరిహారం ఇచ్చారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.14.50 లక్షల చొప్పున ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారా? అని అన్నారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎన్ని సేకరిస్తున్నారని అడిగారు.