VSP: మధురవాడలోని కార్ షెడ్ బస్టాప్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొనటంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.