ఎన్నో వివాదాలు, విమర్శలు మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ మూవీ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సీక్వెల్ మరింత భయంకరమైన చీకటి కథతో రాబోతున్నట్లు, 2026 ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.