KMM: ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ, బాధితులకు సత్వర వైద్యం అందించేలా ఎన్హెచ్ఎఐ (NHAI) అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘1033’ హెల్ప్ లైన్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోలేట్ వద్ద రెండు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదం జరిగిన వెంటనే 108తో పాటు ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.