»Cm Revanth Reddy We Are Already Saying That Kcr Will Join Bjp
CM Revanth Reddy: కేసీఆర్ బీజేపీలో చేరుతారని ముందు నుంచే చెబుతున్నాం
మాజీ సీఎం కేసీఆర్ బీజేపీలో చేరతారని ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. కేసీఆర్ మొదటి నుంచి ఆ పార్టీలోనే చేరతారని చెబుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy: We are already saying that KCR will join BJP
CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ బీజేపీలో చేరతారని ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. గుజరాత్‌ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందాం రండి.. అని రేవంత్ అన్నారు. కేసీఆర్ రైతు భరోసా ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 9 లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానని రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీశ్‌రావు నోరు మూయిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ గురించి ప్రజలకు ముందే తెలుసు. అందుకే బీఆర్ఎస్ను దూరం పెట్టారన్నారు. ఈ పదేళ్లు బీజేపీ తెలంగాణకు ద్రోహం చేసింది. ఈ పదేళ్లలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా? రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారు. రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలి అన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని రేవంత్ అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగించారు. అయిన అన్ని వర్గాల ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.