రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచి రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించి మరోసారి మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచి రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించి మరోసారి మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం వదిలి రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పోజులు చెల్లిస్తుందని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అన్నారు. 40 లక్షలకు పైగా రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.
రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్!
👉 రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లింపు.
👉 హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు.
2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు మాత్రమే రైతులకు అర్హత ఉందా అని నిలదీశారు. 2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలని తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు రూ.2 లక్షల వరకు ఉన్న పంటరుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలన్నారు. అర్హులైన అందరి రైతులకు రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.