Jagapathi Babu : తనకు సిగ్గుశరం లేదంటూ పోస్ట్ పెట్టిన జగపతిబాబు
రకరకాల పాత్రల్లో నటిస్తూ అందరినీ అలరించే జగపతిబాబు రీసెంట్గా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. తనకు సిగ్గూశరం లేదంటూ ఆ పోస్ట్‌పైన రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకలా అన్నారో తెలుసుకుందాం పదండి మరి.
Jagapathi Babu In Casino : హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలో అయినా చక్కగా ఒదిగిపోతారు జగపతిబాబు(Jagapathi Babu). అందుకే ఆయనను తెలుగు ప్రేక్షకులు ప్రేమగా జగ్గూభాయ్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. తన యాక్టింగ్‌తో ఆయన తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారంటే అతిశయోక్తి కాదు. అలాంటి జగపతి బాబు రీసెంట్గా తన ఎక్స్ ఖాతాలో ఓ చిత్రమైన పోస్ట్ పెట్టారు.
కెసీనోలో ఆయన ఉన్న ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెడ్ కలర్ బ్యాగ్రౌండ్ ఉన్న కెసీనోలో(Casino) జగపతిబాబు (Jagapathi Babu) తలుపు చొక్కా, ప్యాంటు వేసుకుని, మెడలో ఓ బ్యాగ్ ధరించి ఉన్నారు. అయితే దానికి క్యాప్షన్ మాత్రం విచిత్రంగా రాశారు. ‘సిగ్గుశరం లేని వాడిని అని దిగులు పడను. మీరు చెబితే పడతాను’ అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి రాసుకొచ్చారు. అయితే ఆయన పెట్టిన పోస్టుకి నెటిజన్లు మాత్రం సరదా సరదాగానే కామెంట్లు పెట్టారు. అది సరదా వరకు ఉండొచ్చుగానీ వ్యసనమే కాకూడదంటూ ఒకాయన కామెంట్ పెట్టారు. మరొకరేమో మీ లైఫ్ మీ ఛాయస్ అంటూ రాసుకొచ్చారు. ఇంకొకరు ఎలా ఉన్నా జగ్గూభాయ్ నెంబర్ 1 అంటూ కామెంట్ చేశారు. మరింకెందుకు ఆలస్యం ఆ పోస్ట్‌పై మీరూ ఓ లుక్కేసేయండి. ఆయన గతేడాది సలార్, రుద్రంగి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. అలాగే ఇప్పుడు సలార్ 2లో నటిస్తున్నారు.