అతి త్వరలోనే సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సలార్ 2కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సలార్ పార్ట్ 1లో కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్‌కు ఈసారి చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
Salaar 2: బాహుబలి తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాడు. ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్గా వాడుకొని.. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌కు పండగ చేసుకున్నారు అభిమానులు. బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సలార్. దీంతో.. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్ మొదటి పార్ట్‌లో వదిలేసిన ప్రశ్నలన్నింటికీ, పార్ట్ 2లో సమాధానం చెప్పబోతున్నాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో సలార్ 2 డైలాగ్స్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. సలార్ పార్ట్1లో ప్రభాస్‌కు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. దాదాపు మూడు గంటల రన్ టైం ఉన్న సినిమాలో.. ప్రభాస్‌కు కనీసం మూడు నిమిషాల డైలాగ్స్ కూడా ఉండవు. ప్రభాస్ కటౌట్, ఎలివేషన్స్‌తోనే గూస్ బంప్స్ తెప్పించాడు ప్రశాంత్ నీల్. కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే.. సలార్ పార్ట్ 2లో మాత్రం అలా ఉండదని అంటున్నారు.
శౌర్యాంగ పర్వంలో ప్రభాస్‌కు భారీ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్, ప్రభాస్ కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ రాసినట్టుగా సమాచారం. సలార్ 1 కంటే 2లో ప్రభాస్ క్యారెక్టర్‌కు భారీ డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు. ఇక.. ఈ సమ్మర్లోనే సలార్ 2 షూటింగ్ మొదలు పెట్టి.. ఇదే ఏడాదిలో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి సలార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.