కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాకు భారీ డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. గోట్ సినిమాకు మరింత డిమాండ్ ఉంది. తాజాగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాకు భారీ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది.
Hero Vijay: చివరగా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. ప్రస్తుతం గోట్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని AG ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దాదాపు 200 కోట్లకి పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి.. రీసెంట్‌గానే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఈ సాంగ్‌కి అనుకున్నంత రీచ్ రాలేదు.
సెప్టెంబర్ 5న గోట్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే.. ఇప్పటికే పొలిటికల్ పార్టీ ప్రకటించిన విజయ్.. త్వరలోనే పూర్తిగా రాజకీయాల పై దృష్టి పెట్టనున్నాడు. దీంతో గోట్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అన్ని భాషలకి కలిపి 150 కోట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం.
ఇప్పుడు శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్ వర్క్ ఏకంగా 90 కోట్లకి కొనుగోలు చేసిందట. అన్ని భాషలకి సంబందించిన హక్కుల కోసం ఇంత మొత్తం చెల్లిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ లెక్కన నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే గోట్ మూవీకి 240 కోట్ల వరకు వచ్చాయని అంటున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా.. ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయనే చెప్పాలి. మరి గోట్ ఎలా ఉంటుందో చూడాలి.