బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ రతకా రోజ్ అందరికీ పరిచయమే. బిగ్ బాస్ హౌజ్‌లో రచ్చ చేసిన రతికా.. తన గ్లామర్‌తో కుర్రాకారును ఫిదా చేసేసింది. బిగ్ బాస్ సీజన్ అయిపోయేవరకు అమ్మడు ట్రెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ హాట్ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
Rathika Rose: బిగ్ బాస్ 7 సీజన్లో తన క్యూట్‌నెస్‌తో ఆడియెన్స్‌ను ఫిదా చేసింది రతికా రోజ్. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన రతికా.. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల వచ్చిన బాలయ్య భగతవంత్ కేసరి సినిమాలోను అలా మెరిసింది. అయితే బిగ్ బాస్ సీజన్ సమయంలో తెగ వైరల్ అయిన రతికా ఈ మధ్య కాస్త సైలెంట్ అయిపోయింది. కానీ రతిక మాత్రం మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా మంచి సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్నారు. కొందరు హీరోలుగా కూడా చేస్తున్నారు. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. ఆ మధ్య రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో కనిపించి షాక్ ఇచ్చింది సిరీ హనుమంత్. ఏకంగా షారుఖ్ సినిమాలో ఛాన్స్ అంటే మామూలు కాదు.
ఇక ఇప్పుడు రతిక కూడా బడా హీరోతో ఛాన్స్ అందుకున్నట్టుగా చెబుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి సినిమాలో కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయినట్టుగా సమాచారం. అయితే.. ఏ సినిమాలో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి రాజకీయంగా బిజీ కానున్నాడు. దీంతో.. రతికకు ఏ సినిమాలో ఛాన్స్ వచ్చిందనే క్లారిటీ లేదు. కానీ ఒకవేళ.. విజయ్ సినిమాలో అమ్మడికి ఛాన్స్ అంటే మాటలు కాదనే చెప్పాలి.