»Sandeep Was Eliminated From Bigg Boss Do You Know The Remuneration
Bigg Boss7 : బిగ్‌బాస్ నుంచి ‘ఆట’ సందీప్ ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
బిగ్ బాస్’ హస్ నుంచి సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.తొలి మేల్ కంటెస్టెంట్‌గా సందీప్ బయటకు వచ్చేశాడు. దీంతో మిగిలిన ముగ్గురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
బిగ్‌బాస్ సీజన్-7 (Bigg Boss Season-7) నుంచి సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.రోజురోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఈ సీజన్ మొదలు అయినప్పటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.కాని ఈ వారం మాత్రం మొట్టమొదటిగా సారిగా ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్‌లో శోభాశెట్టి(Sobha Shetty), భోలే షావలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్దీప్, సందీప్, గౌతమ్ ఉండగా, వీరిలో చివరకు సందీప్, శోభాశెట్టి మిగిలారు.వీరిద్దరిని ఒక గదిలో కూర్చొబెట్టి వాళ్ల చేతులకు ప్యాచ్‌ను అతికించుకోమన్నారు హోస్ట్ నాగార్జున(Host Nagarjuna). కౌంట్‌డౌన్ మొదలయ్యాక ఇద్దరీ హార్ట్ బీట్ ప్లాస్మా టీవీపై కనిపిస్తుందని.. ఎవరీ హార్ట్ బీట్ అయితే కంటిన్యూ అవుతుందో వాళ్లు సేఫ్, హార్ట్ బీట్ ఆగిన పోయిన వారు ఎలిమినేట్ (Eliminate) అవుతారన్నారు.
సందీప్ హార్ట్ బీట్ ఆగిపోయినట్లు చూపించడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. సందీప్ ఎలిమినేషన్‌తో తేజ, శోభ, ప్రియాంక (Priyanka) భావోద్వేగానికి గురయ్యారు.సందీప్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు. సందీప్ ఎలిమినేషన్‌తో తేజ, శోభ, ప్రియాంక ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు.సందీప్ మాస్టర్ సుమారు ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు. బయటకు వెళ్తూ వెళ్తూ ఎమోషనల్ (Emotional) అయ్యాడు. ఇక కంటెస్టెంట్లు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే ఎలిమినేట్ అయినా సందీప్ మాస్టర్‌కు బాగానే రెమ్యునరేషన్ (Remuneration) అందినట్లు తెలుస్తోంది. వారానికి సుమారు రూ. .2.75 లక్షలు చొప్పున.. మొత్తం రూ.22 లక్షలు పైనే రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇతర కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు.