Bigg Boss Telugu 7: మరోసారి రతిక సేఫ్.. పాపం బోలే ఎలిమినేట్..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ వారం బోలే షావలి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. షావలీ- రతిక చివరి స్థానంలో ఉండగా.. కొన్ని ఓట్లతో బోలె ఎలిమినేట్ అయ్యారని సమాచారం.
Bigg Boss Telugu 7: Rathika safe – Bhole eliminated
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఎలాంటి గేమ్స్ లేకుండా ఫ్యామిలీ వీక్ చేశారు. ఆ తర్వాత కేవలం కెప్టెన్సీ రౌండ్ పెట్టారు. శివాజీ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. నామినేషన్స్ లో కేవలం ఐదుగురు సభ్యులు ఉండగా, వారిలో రతిక ఎలిమినేట్ కావడం ఖాయం అని అంతా భావించారు. తాజా నివేదికల ప్రకారం.. రతిక సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
అనధికారిక పోల్స్‌లో రెండవ చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. భోలేకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య తేడా చాలా తక్కువ అంటున్నారు. తక్కువ ఓట్లు రావడంతో భోలే ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నిజానికి రతిక ఎలిమినేట్ అవ్వకుండా ఉండేందుకు బిగ్ బాస్ చాలా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా.. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండవ వారంలో షకీలా, మూడవ వారంలో దామిని, నాల్గొ వారంలో రతిక, ఐదో వారంలో సుభశ్రీ, ఆరో వారంలో నయని, ఏడవ వారంలో పూజ, ఎనిమిదో వారంలో సందీప్, తొమ్మిదో వారంలో తేజ ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ తెలుగు 7 లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ చక్కగా సాగిందని తెలుస్తోంది. భోలే షావాలి, ప్రిన్స్ యావర్, రాతికా రోజ్, శివాజీ, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు. అనధికారిక ఓటింగ్‌లో శివాజీ అగ్రస్థానంలో నిలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లో అనూహ్య మార్పులు జరిగాయి. పోలింగ్ ముగిసే సమయానికి ప్రిన్స్ యావర్ రెండో స్థానంలో నిలిచారు. బోలే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లినట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.