Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనన్య పాండే కొత్త ఇల్లు కొనుగోలు చేయడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.
పసుపు రంగు దుస్తులను ధరించి, చేతులతో నమస్కారం చేసి పోజులిచ్చింది. కొత్త ఇంట్లో పూజ నిర్వహించింది. గృహప్రవేశ పూజా ఆచారాల సమయంలో ఇంటి గుమ్మం మీద కొబ్బరికాయను పగలగొడుతున్న ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ఆ ఫోటోలపై అనన్య పాండే తల్లి భావన పాండే స్పందించింది. ‘మీ గురించి చాలా గర్వంగా ఉంది! ప్రకాశించండి!’ కృతజ్ఞతలు,” అంటూ ట్వీట్ చేసింది. కాగా, మాళవిక మోహనన్, గౌహర్ ఖాన్, అమృతా అరోరా, షానాయ కపూర్, సన్యా మల్హోత్రా , మహీప్ కపూర్ కూడా అనన్యపై తమ ప్రేమను చాటుకున్నారు.
అనన్య .. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుంచి వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదాను అందుకోలేకపోయింది. అనన్య పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
విజయ్ దేవర కొండతో కలిసి లైగర్ మూవీలో నటించింది. ఆ సినిమా విజయం సాధిస్తే, దక్షిణాదిన కూడా ఈ బిజీ హీరోయిన్గా మారిపోయేది. డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇక్కడ కనపడలేదు. రీసెంట్గా డ్రీమ్ గర్ల్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రేమలో పడింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.