NLG: చిట్యాల మండలంలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు విడుదల చేశారు. 18 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు 56 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. 180 వార్డులలో 13 వార్డులకు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. మిగిలిన 167 వార్డులకు 433 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని అన్నారు.