KRNL: కలెక్టర్ డా. ఎ. సిరి బుధవారం ఆదోనిలో పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. తేమ శాతం సీసీఐ కొనుగోలు పరిమితికి మించినా రైతులను వెనక్కి పంపకుండా, మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్లాట్ బుకింగ్, తేమ, రంగు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదని సీసీఐ అధికారులకు సూచించారు.