WG: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAYG) పథకం ప్రారంభించింది. వీటి దరఖాస్తుల గడువు ఇటీవల ముగియగా.. లబ్ధిదారుల దృష్ట్యా ఈ నెల 14వరకు పొడిగించింది. గతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి వివరాలను ఆన్లైన్లో తొలగించి.. కొత్తగా అవకాశం కల్పించనుంది. ఇంటి ఏర్పాటుకు రూ.2.50 లక్షల రాయితీని ఇవ్వనుంది.