ELR: జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేసే భూసేకరణకు సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్టు, R&R పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూసేకరణపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.