VZM: కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితిపై చర్చిస్తారు.