అమెరికన్ డాలర్ దెబ్బకు భారత్ రూపాయి విలవిలలాడుతోంది. భారత కరెన్సీ విలువ జీవనకాల కనిష్టానికి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 28 పైసలు నష్టపోయి.. ఏకంగా రూ.90.43కి చేరింది. డాలర్ బలపడటం, విదేశీ నిధులు తరలిపోవడంతో రూపాయికి కష్టాలు ఎదురయ్యాయి. దీనివల్ల దిగుమతులు ఖరీదై.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.