GNTR: మంగళగిరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 31 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎస్జీటీ, వివిధ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఎస్జీటీకి రూ. 10 వేలు, ఎస్ఏకి రూ. 12,500 గౌరవ వేతనం ఇస్తారు. అర్హులు డిసెంబర్ 5లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని ఎంఈవో ఎన్.బాబు తెలిపారు.