JGL: మెట్పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రిని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రజల ఇబ్బందులను తీర్చాలని, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థలో ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.