AP: విజయవాడ జోజినగర్ కూల్చివేతల బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇళ్లు లేక రోడ్డున పడ్డామని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను సీఎంకు వివరించేందుకు అవకాశం ఇవ్వాలని రాత్రి ఆయన ఇంటి దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతి పత్రాలు తీసుకుని రావాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు.