కామరెడ్డి మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల లెక్కను అధికారులు తేల్చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను సైతం కేటాయించారు. 14 సర్పంచ్ పదవులకు 67 మంది, 120 వార్డు స్థానాలకు 303 బరిలో నిలవగా 13 మంది వార్డు స్థానాలకు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.