NLG: యువత సైబర్ నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై డి.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని ఆమనగల్ గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వాహిస్తున్నామన్నారు.