JGL: వెల్గటూర్ పోలీసులు జిల్లా పరిషత్ హైస్కూల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. అపరిచితులకు వోటీపీ, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, నకిలీ పెట్టుబడి స్కీములు, లోన్ యాప్లు, డిజిటల్ అరెస్ట్, లాటరీ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు.