ELR: పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో కోడి కత్తులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో పెదవేగి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో తయారీ కేంద్రంపై నిన్న రాత్రి దాడి చేశారు. అక్కడ కోడి పందేల కోసం కత్తులు తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 500 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కత్తులు తయారు చేసే 2 యంత్రాలను సీజ్ చేశారు.