TG: ఈనెల 13న ట్రాఫిక్ చలాన్లపై 100% వరకు రాయితీ అంటూ జరుగుతున్న ప్రచారంపై HYD పోలీసులు స్పందించారు. లోక్ అదాలత్ నోటిఫికేషన్ లేదని, అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. అనధికారిక సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని, పోలీస్ హ్యాండిల్స్‌ను చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, పలు రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ ఉండటంతో ఈ ప్రచారం జరిగినట్లు టాక్.