పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకల్లో అదనపు కలెక్టర్ దాసరి వేణు దివ్యాంగులకు పిలుపునిచ్చారు. మనోధైర్యంతో జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే దిశగా పని చేయాలని, అంగవైకల్యం అడ్డం కాకుండా పట్టుదల, ఆత్మస్థైర్యంతో జయించాలని ఆయన కోరారు.