VSP: విశాఖ వేదికగా IFR-2026, మిలన్-2026ని వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళాధిపతి సంజయ్ భల్లా బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 18న IFRకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. 23 యుద్ధ నౌకలు, 2 యుద్ధ విమానాలు పాల్గొననున్నట్లు వివరించారు. 137 దేశాలకు ఆహ్వానం పంపగా, 63 దేశాలు అంగీకరించాయన్నారు.