AP: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర విభజన చట్టం 2014కు సవరణ చేయడానికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ఈ సవరణ చట్టానికి కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత, దానిని పార్లమెంట్‌కు పంపనున్నారు. పార్లమెంట్ ఆమోదం పూర్తయిన తర్వాత.. కేంద్రం అమరావతిని రాజధానిగా ధ్రువీకరిస్తూ గెజిట్ విడుదల చేయనుంది.