E.G: PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) పథకంలో గృహ నిర్మాణాల కోసం డిసెంబర్ 14 లోపు ధరఖాస్తు చేసుకోవాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. గోకవరం మండలం తమ పరిధిలో ఉన్న గ్రామ వార్డ్ సచివాలయాలను సంప్రదించాలన్నారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 2.50 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.