NDL: కోవెలకుంట్ల మండలం కల్లుగొట్లలో వెలసిన ప్రసిద్ధ కాశీ నాయన ఆశ్రమంలో గురువారం స్వామివారి ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు రామచంద్ర రెడ్డి స్వామి వెల్లడించారు. ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.