VKB: వారంలో రెండు రోజులు ప్రజావాణి నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ప్రతి మంగళవారం, గురువారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపుతామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.