నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం శివారులో జింకను చంపిన నలుగురిని బుధవారం పట్టుకున్ననట్లు NZB రూరల్ PS SHO శ్రీనివాస్ తెలిపారు. బోర్గాం గ్రామానికి చెందిన గంధం విజయ్, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్ వారం రోజుల కిందట వల వేసి జింకను పట్టుకుని చంపినట్లు సమాచారం వచ్చిందని SHO తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.