NZB: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగియడంతో బోధన్ మండలంలో నాలుగు పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. బోధన్ మండలం మావంది కలాన్ శకుంతల, పెంటాకుర్థు క్యాంప్ వేములపల్లి రాధిక, పెంటాకలాన్ కళావతి, భూలక్ష్మీ క్యాంప్ బాల్ రెడ్డిలు సర్పంచి స్థానాలు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.