SKLM: 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో సార్వత్రిక విద్యా ప్రవేశాలకు ఈనెల 6వ తేదీ వరకు గడువు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రవేశాలు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.