TG: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో సర్వీసులు స్తంభించాయి. టెక్నికల్ సమస్యల కారణంగా శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 33 విమానాలు రద్దయ్యాయి. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ రావాల్సిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేశారు. హఠాత్తుగా విమానాలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాయాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు.