ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో భాగంగా జరుగుతున్న గబ్బా పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. దీంతో ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి టెస్ట్ ఓడిన స్టోక్స్ సేన ఈ మ్యాచ్లో గెలిచి లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉంది. అటు పింక్ బాల్ టెస్టుల్లో ఆరితేరిన ఆసీస్ తొలి టెస్ట్ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉంది.