మెదక్: జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు, రేపు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ వెల్లడించారు. సైన్స్ ఫెయిర్ నిర్వహణ కోసం 17 కమిటీలను ఏర్పాటు చేశామని, ఇవి సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.