NLG: చిట్యాల మండలం తాళ్ల వెల్లంలకు చెందిన ఆదర్శ రైతు పజ్జూరు అజయ్ కుమార్ రెడ్డి ‘రైతురత్న’ అవార్డు అందుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో పీజీపీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అవార్డును అందించారు. సమీకృత వ్యవసాయ విధానాన్ని అవలంభిస్తున్న అజయ్‌ని మంత్రి తుమ్మల ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను అందజేసి అభినందించారు.