WGL: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో వీసీ రాజీనామాతో సరిపెడుతున్నారనే చర్చ మొదలైంది. పరీక్ష పేపర్ల వ్యవహారంలో కీలకమైన ఎగ్జామినేషన్ కంట్రోలర్ పదేళ్లుగా ఒకరే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. సంబంధం లేని వ్యక్తికి ఈ విభాగాన్ని ఎలా కేటాయిస్తారని ప్రభుత్వ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.