VZM: పూసపాటిరేగ మండలం కనిమెట్ట వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భోగాపురం వాసి ప్రసాదరావు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి కారులో వస్తున్న ప్రసాదరావు కనిమెట్ట వద్ద దిగి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.