ASR: జీకే.వీధి మండలం సీలేరు నదిలో గిరిజనులు వేసిన వలకు అరుదైన డోబి జాతి చేప బుధవారం చిక్కింది. 22 కేజీల బరువున్న ఈ భారీ చేపను ఒరిస్సా మల్కనగిరి జిల్లా అల్లూరి కోట పంచాయతీ కొందుకూడా గ్రామానికి చెందిన గిరిజనులు పట్టారు. చేపను స్థానిక బాలాజీ రెస్టారెంట్ యజమాని నక్క జ్ఞానేశ్వరరావు కొనుగోలు చేశారు.