BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బార్కోడ్ లేకుండా వస్త్రాలను విక్రయిస్తున్న వ్యాపారికి ఈవో దామోదర్‌రావు నిన్న నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ పట్టుబడిన సదరు వ్యాపారి, మళ్లీ మంగళవారం కూడా బార్కోడ్ లేని పంచెలు, చీరలు విక్రయిస్తూ కౌంటర్లో దొరికారు. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈవో ఆదేశించారు.