GNTR: మంగళగిరి మండలం నవులూరులో వీధి కుక్కల బెడదకు అధికారులు చెక్ పెట్టారు. కుక్కల దాడులతో జనం, వాహనదారులు బెంబేలెత్తుతుండటంతో గురువారం వాటిని బంధించే కార్యక్రమం చేపట్టారు. పట్టుకున్న కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటీ రేబీస్ టీకాలు వేసి తిరిగి వదిలేస్తామని సిబ్బంది తెలిపారు. అధికారుల చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.