CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి కపిల తీర్థంలో గురువారం ఉదయం అయ్యప్ప దీక్ష చేపట్టారు. మకర సంక్రాంతి వరకు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాలధారణ చేశారు. ఆయన వెంట కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.